మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు..
📌 మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు.. ▪️ "మేము నిటారుగా నిల్చుంటాం. ఎవరిముందు తలవంచం. మా మిత్రులందరికీ స్నేహహస్తం అందుబాటులో ఉంటుంది. మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం" 1982లో ఈ మాటలు పలికినవారు ఉక్కు మహిళగా పేరుపొందిన నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ను ఉద్దేశించి. సందర్భం ఏమిటంటే- భారత్ను అమెరికా శిబిరంలో చేరాలని ప్రెసిడెంట్ రీగన్ చేసిన ప్రతిపాదనకు శ్రీమతి ఇందిరాగాంధీ నిష్కర్షగా చెప్పిన సమాధానం అది. ఆమె ఈ మాటల్ని ఎక్కడో అనలేదు. అమెరికా పర్యటించినపుడు సాక్షాత్తు రోనాల్డ్ రీగన్ సమక్షంలోనే అమెరికా, రష్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తాము ఎవరి పక్షమూ వహించబోమని, దౌత్యపరంగా తమది తటస్థ వైఖరి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ▪️ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు మొదలుకొని, అటల్ బిహారీ వాజ్పేయి వరకు, మధ్యలో దేవెగౌడ, ఐకె గుజ్రాల్తోసహా దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ వారున్నా, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వారెవరున్నా.. భారత దేశ విదేశాంగ విధానం సుదృఢంగా అలీన విధానం (నాన్ అలైన్డ్)గానే కొనసాగింది. నిజానికి ఆనాటికి భారత్ నేటి మాదిర...